Visakhapatnam: స్థానికులకే సీటు ఇవ్వాలని కూటమి నాయకుల డిమాండ్

Visakhapatnam: కార్పొరేషన్ ఎన్నికల్లో పాత 6, కొత్త 10వ వార్డులో స్థానికులకే సీటు ఇవ్వాలని కూటమి నాయకుల డిమాండ్. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు విజ్ఞప్తి చేయాలని నిర్ణయం.

JAI RAM, MADURAWADA
Published on: 28 Sept 2026 10:17 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: స్థానికులకే సీటు ఇవ్వాలని కూటమి నాయకుల డిమాండ్

విశాఖపట్నం: రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో పాత 6 కొత్త 10 వ వార్డు గా మారినటువంటి వార్డులో ఎన్ డి ఏ అధిష్టానం ఎవరికి సీటు ఇచ్చినా స్థానికులకు ఇవ్వమని అభ్యర్ధించాలని వార్డులో కూటమి నాయకులు నిర్ణయించారు. ఈ విషయమై స్థానిక శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావుని మూడు పార్టీల నాయకులు ఉమ్మడిగా కలసి విన్నవించాలని నిర్ణయం చేసినారు.

గత ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని స్థానికేతరులకు సీటు ఇచ్చి, గెలిచిన తరువాత వార్డులో కనిపించకుండా ఉండే పరిస్థితి మనమందరం చూసాం. మంత్రిగారి కూతురని గెలిపించి చివరకు అభివృద్ధి కుంటుపడటం కూడా చూసాం. దాని పర్యవసానం ఈరోజు పాత 6 వ వార్డులో తీవ్రమైన నీటి ఎద్దడి, తీవ్రమైన శానిటేషన్ ప్రాబ్లెమ్, గోతుల రోడ్లు, పి ఎం పాలెం ఒక అనాధ వార్డ్ గా మిగిలిపోయిన కారణంగా కూటమి నాయకులు ఒకింత ఆగ్రహంతో ఉన్నట్టు వ్యక్తపరిచారు.

ఈ విషయమై మూడు పార్టీల అధిష్టానం దృష్టికి కూడా తీసుకువెళ్లాలని. తద్వారా స్థానికులకు గాని మరియు సుదీర్ఘకాలం పార్టీకి పనిచేసిన కార్యకర్తలు, నాయకులకు, స్థానికులకు మాత్రమే ఇవ్వాలన్న ప్రతిపాదన పై తీర్మానం చేసినట్టు తెలియచేయడమైనది.

ఈ సమావేశంలో టిడిపి, బిజెపి, జనసేన వార్డు అధ్యక్షులు గరే గురునాథ్, జి ఆర్ ఎస్ ఎన్ రాజు, సంతోష్ నాయుడు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్రీనివాస్, బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి కె ఎన్ పి చక్రవర్తి, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు ఈ ఎన్ ఎస్ చంద్రరావు, బిజెపి వార్డు ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రాజు, టిడిపి నాయకులు రెడ్డి సత్యనారాయణ, కొప్పాక క్రిష్ణ, జనసేన వార్డు ప్రధాన కనకరాజు తదితరులు పాల్గొన్నారు...

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA