Visakhapatnam: విశాఖలో ఆటో ప్రయాణికురాలి బంగారం చోరీ ఇద్దరు అరెస్ట్!

Visakhapatnam: విశాఖలో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ దృష్టి మళ్లించి బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఇద్దరు మహిళలను ఎంవీపీ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

SHIVA, BHIMILI
Published on: 4 Sept 2026 4:40 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖలో ఆటో ప్రయాణికురాలి బంగారం చోరీ ఇద్దరు అరెస్ట్!

Visakhapatnam: ​ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ దృష్టి మళ్లించి బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఇద్దరు మహిళా కేడీలను ఎంవీపీ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

​పోలీసుల వివరాల ప్రకారం పెద్ద వాల్తేరు ప్రాంతానికి చెందిన పి. గౌతమి ఈనెల 26న పూర్ణా మార్కెట్ నుండి ఆటోలో వస్తుండగా,జగదాంబ జంక్షన్ వద్ద మరో ఇద్దరు మహిళలు అదే ఆటో ఎక్కారు.విశాఖ ఐ హాస్పిటల్ వద్ద గౌతమి దిగి ఆటో డ్రైవర్‌కు డబ్బులు ఇస్తుండగా,తన బ్యాగ్‌లోని బంగారు ఆభరణాలు మాయమైనట్లు గుర్తించి ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

​డీసీపీ,ఏసీపీ (క్రైమ్స్) నేతృత్వంలో ఎంవీపీ సీఐ వి.చక్రధర రావు,ఎస్‌ఐ ఎస్. రాజు బృందం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి,నిందితులు రావుల వసంత (26), ఆవుల పార్వతి (28)లను బృందావన్ పార్క్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని,కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.చాకచక్యంగా కేసును ఛేదించిన పోలీసు అధికారులను, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story