Visakhapatnam: 27 మందికి సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ: ఎంపీ శ్రీభరత్

Visakhapatnam: విశాఖపట్నంలో 27 మంది లబ్ధిదారులకు రూ.15,79,894 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ అందజేశారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 13 Oct 2026 7:24 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: 27 మందికి సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ: ఎంపీ శ్రీభరత్

Visakhapatnam: ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలు మెరుగైన ఆరోగ్య సేవలకు దూరంకాకుండా వారికి అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ఎంతగానో దోహదపడుతోందని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ పేర్కొన్నారు.

లాసన్స్ బే కాలనీలోని తన కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన చెక్కులను ఎంపీ శ్రీభరత్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మొత్తం 27 మంది లబ్ధిదారులకు రూ.15,79,894 విలువైన ఆర్థిక సాయం పంపిణీ చేశారు.

అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులను భరించలేని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఊరటనిస్తుందని ఆయన తెలిపారు. అర్హులైన బాధితులకు ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తామని, ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందిన ఆర్థిక సాయం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి గారికి, ఎంపీ శ్రీభరత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.