Visakhapatnam: విశాఖ మేయర్ అభ్యర్థిగా ముక్కా శ్రావణి సరైన ఎంపిక: ఎంపీ భరత్!
Visakhapatnam: విశాఖ మేయర్ అభ్యర్థిగా డాక్టర్ ముక్కా శ్రావణికి విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ సంపూర్ణ మద్దతు తెలిపారు. జీవీఎంసీ సుస్థిరాభివృద్ధికి ఆమె సరైన నాయకురాలని పేర్కొన్నారు.
Visakhapatnam: విశాఖ మేయర్ అభ్యర్థిగా ముక్కా శ్రావణి సరైన ఎంపిక: ఎంపీ భరత్!
విశాఖపట్నం: విశాఖపట్నం మేయర్ పదవికి కూటమి ఉమ్మడి అభ్యర్థిగా డాక్టర్ ముక్కా శ్రావణి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ ఆమెకు మద్దతు తెలిపారు. నగర అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే సమర్థవంతమైన నాయకత్వం విశాఖకు అవసరమని ఆయన పేర్కొన్నారు.
మేయర్ అభ్యర్థి ఎంపికలో కూటమి నాయకులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని డాక్టర్ ముక్కా శ్రావణిని ఎంపిక చేసినట్లు ఎంపీ తెలిపారు. 2021 నుంచి కార్పొరేటర్గా ప్రజలకు సేవలందిస్తున్న ఆమె, ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ తన వార్డులో మంచి మెజారిటీ సాధించి ప్రజల మద్దతును పొందారని గుర్తుచేశారు. ఆమె కుటుంబ సభ్యులు ముత్యాల నాయుడు, కిషోర్లు పార్టీకి అందించిన సేవలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు.
విశాఖపట్నం నగరం పారిశ్రామికంగా, ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, సుమారు రూ.4,000 కోట్ల బడ్జెట్ కలిగిన జీవీఎంసీని సమర్థవంతంగా నిర్వహించగల నాయకత్వం అవసరమని శ్రీభరత్ అన్నారు. ప్రజల అవసరాలకు ప్రాధాన్యమిస్తూ, పారదర్శకత, నిజాయితీ, నిర్ణయాత్మక సామర్థ్యంతో నగర పాలన సాగాలని ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ల మార్గదర్శకత్వంలో విశాఖపట్నాన్ని సుస్థిరాభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు డాక్టర్ ముక్కా శ్రావణి కృషి చేస్తారనే విశ్వాసాన్ని ఎంపీ వ్యక్తం చేశారు.




