Visakhapatnam: వార్డుల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి..ఎమ్మెల్యే!

Visakhapatnam: విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై సమీక్షించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. వార్డుల్లో పనులు వేగవంతం చేయాలని ఆదేశం.

JAI RAM, MADURAWADA
Published on: 17 Sept 2026 6:47 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: వార్డుల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి..ఎమ్మెల్యే!

Visakhapatnam: వార్డుల్లో అభివృద్ధి పనులు. వేగవంతం చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలోని వార్డు అధ్యక్షులతో ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఆయన సమావేశమయ్యారు. వార్డుల్లో అభివృద్ధి పనులు, పరిష్కరించాల్సిన సమస్యలను సమీక్షించారు. పెండింగ్ పనులను గుర్తించి వాటిని గడువులోగా పూర్తి చేయించాలన్నారు.

వర్షాభావంతో నీటి సమస్య తీవ్రతరమైన కారణంగా అవసరమైన ప్రాంతాల్లో బోర్లు తవ్వించాలని సూచించారు. తారు ధరలు పెరగడంతో మందకొడిగా జరుగుతున్న బీటీ రోడ్ల పనుల వేగం పెరిగేలా ప్రభుత్వం తొందర్లోనే నిర్ణయం తీసుకోనుందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేలా నిరంతరం వార్డుల్లో తిరగాలన్నారు. స్థానిక ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధనకు సన్నద్ధం కావాలని చెప్పారు.

సమావేశంలో పార్టీ నాయకులు చిక్కాల విజయ్ బాబు, నాగోతి సత్యనారాయణ, గరే గుర్నాథ్, కానూరు అచ్యుతరావు, చెట్టుపల్లి సన్యాసిరావు, పంచదార్ల శ్రీనివాస్, గొలగాని నరేంద్ర, తమ్మిన సూరిబాబు, జీరు సత్యం, పాసి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA