Endada: రూ.25 కోట్లతో రాజీవ్ స్వగృహ లేఅవుట్ అభివృద్ధి: గంటా

Endada: ఎండాడ రాజీవ్ స్వగృహ లేఅవుట్‌లో రూ.25 కోట్లతో చేపట్టే రోడ్లు, పైప్‌లైన్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు.

JAI RAM, MADURAWADA
Published on: 28 Sept 2026 8:56 PM IST
Endada
X

Endada: రూ.25 కోట్లతో రాజీవ్ స్వగృహ లేఅవుట్ అభివృద్ధి: గంటా

ఎండాడ: స్థానిక రాజీవ్ స్వగృహ లే అవుట్ లో రూ. 25 కోట్లతో చేపట్టనున్న మౌలిక సౌకర్యాల కల్పన పనులకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సోమవారం శంకుస్థాపన చేశారు.

ఇక్కడ నిర్మించనున్న రోడ్లు, మంచి నీటి పైప్ లైన్లు, డ్రెయిన్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి పనులను పబ్లిక్ హెల్త్ డిపార్మెంట్ పర్యవేక్షిస్తుంది. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ లే అవుట్ అభివృద్ధిలో మౌలిక వసతులు ముఖ్యమని పేర్కొన్నారు.

నాణ్యత విషయంలో రాజీ లేకుండా నిర్దేశించిన గడువులోగా పనులను పూర్తి చేయాలని చెప్పారు. స్థానిక నాయకులు చెట్టుపల్లి గోపీ, లొడగల అప్పారావు, చెట్టిపల్లి సన్యాసిరావు, సారిపల్లి శ్రీనివాస్, మంగాదేవి, దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA