Visakhapatnam: విశాఖ మేయర్ ముక్కా శ్రావణిని పరామర్శించిన మంత్రి లోకేష్

Visakhapatnam: విశాఖపట్నం మేయర్ ముక్కా శ్రావణి తండ్రి ముక్కా ముత్యాల నాయుడు మృతి నేపథ్యంలో ఆమె నివాసానికి వెళ్లి పరామర్శించి నివాళులర్పించిన మంత్రి నారా లోకేష్.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 23 Nov 2026 4:57 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖ మేయర్ ముక్కా శ్రావణిని పరామర్శించిన మంత్రి లోకేష్

విశాఖపట్నం: విశాఖపట్నం నగర మేయర్ ముక్కా శ్రావణి, కుటుంబ సభ్యులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం పరామర్శించారు. ఆమె తండ్రి, టీడీపీ నేత ముక్కా ముత్యాల నాయుడు శుక్రవారం మృతిచెందారు. ఈ నేపథ్యంలో విశాఖలోని ఆమె నివాసానికి వెళ్లిన మంత్రి లోకేష్.. ముక్కా శ్రావణి, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ముత్యాల నాయుడు చిత్రపటం వద్ద పూలు ఉంచి నివాళులు అర్పించారు. కార్పోరేటర్ గా, టీడీపీ నేతగా, విశాఖ జిల్లా పార్టీ బీసీ విభాగం ఉపాధ్యక్షుడిగా ముత్యాలనాయుడు ప్రజలకు, పార్టీకి అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని చెప్పారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.