Visakhapatnam: విశాఖలో పీవీ సింధు అకాడమీకి శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్

Visakhapatnam: విశాఖపట్నం అరిలోవలో పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్ లెన్స్ నిర్మాణానికి భూమిపూజ చేసిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.

SHIVA, BHIMILI
Published on: 5 Aug 2026 4:52 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖలో పీవీ సింధు అకాడమీకి శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్

విశాఖపట్నం: విశాఖపట్నం అరిలోవ ప్రాంతంలోని తోటగరువులో భారతదేశ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తలపెట్టిన సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్ లెన్స్ నిర్మాణ పనులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం భూమిపూజ చేశారు.

ముందుగా తోటగరువులోని అకాడమీ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు పీవీ సింధు, ఇతర కుటుంబ సభ్యులు, టీడీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం పీవీ సింధు, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్ లెన్స్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అకాడమీ భవన నమూనాతో పాటు క్రీడాకారులకు అందుబాటులోకి రానున్న అత్యాధునిక సౌకర్యాలు, వసతుల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. అకాడమీపై రూపొందించిన ఏవీని వీక్షించారు. అందరితో కలిసి గ్రూప్ ఫోటో దిగారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, శాప్ ఎండీ ఎస్.భరణి, గ్రీన్ కో ఎనర్జీ ఎఫీషియన్సీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ చలమలశెట్టి స్వాతి తదితరులు పాల్గొన్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story