Malkapuram: విశాఖలో తప్పిపోయిన మైనర్ బాలిక ఆచూకీ 24 గంటల్లో కనిపెట్టిన పోలీసులు!
Malkapuram: విశాఖ శ్రీహరిపురంకు చెందిన మైనర్ బాలిక అదృశ్యం కేసును 24 గంటల్లో చేధించిన మల్కాపురం పోలీసులు. విజయవాడలో ఆచూకీ గుర్తించి తల్లిదండ్రులకు అప్పగింత.
Malkapuram: విశాఖలో తప్పిపోయిన మైనర్ బాలిక ఆచూకీ 24 గంటల్లో కనిపెట్టిన పోలీసులు!
Malkapuram: మల్కాపురం పోలీస్ స్టేషన్ తప్పిపోయిన మైనర్ అమ్మాయి ఆచూకీ 24 గంటల్లో కనిపెట్టిన మల్కాపురం పోలీసులు. వివరాల్లోకి వెళితే శ్రీహరి పురానికి చెందిన పదహారేళ్ల అమ్మాయి సెల్ ఫోను ఎక్కువగా వాడుతుందని కుటుంబ సభ్యులు మందలించడంతో అలిగి ఇంటి నుండి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 25వ తారీఖున మల్కాపురం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మల్కాపురం సీఐ నరసింహారావు గారి ఆధ్వర్యంలో దర్యాప్తు అధికారి ఎస్సై అప్పలనాయుడు గారు సాంకేతిక పరిజ్ఞానంతో అమ్మాయి ఆచూకీ విజయవాడలో కనిపెట్టి 24 గంటల్లోనే అమ్మాయిని విజయవాడ నుండి తీసుకువచ్చి అమ్మాయి తల్లిదండ్రులకు అప్పగించడంతో వారు సిఐ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.




