Visakhapatnam: పండుగ పూట విషాదం.. నాగుల చవితికి వెళుతూ యువతి దుర్మరణం!

Visakhapatnam: విశాఖ మధురవాడ లా-కాలేజ్ కూడలి వద్ద నాగుల చవితి వేడుకలకు సొంతూరికి వెళుతున్న అక్కాచెల్లెళ్ల స్కూటీ డివైడర్‌ను ఢీకొనడంతో అమృత వర్షిని (21) అక్కడికక్కడే మృతి చెందింది.

JAI RAM, MADURAWADA
Published on: 13 Nov 2026 3:00 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: పండుగ పూట విషాదం.. నాగుల చవితికి వెళుతూ యువతి దుర్మరణం!

విశాఖపట్నం: నాగుల చవితి పర్వదినాన పుట్టలో పాలు పోసేందుకు ఎంతో సంతోషంగా సొంతూరికి బయలుదేరిన ఓ యువతిని మృత్యువు కబళించింది. అదుపుతప్పిన ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొనడంతో చెల్లి అక్కడికక్కడే మృతి చెందగా, అక్క స్వల్ప గాయాలతో బయటపడింది. ఈవిషాదకర ఘటన శుక్రవారం ఉదయం మధురవాడ లా-కాలేజ్ కూడలి వద్ద చోటుచేసుకుంది.

మధురవాడ, పీఎం పాలెం ఆఖరి బస్టాప్ ప్రాంతానికి చెందిన గోరుమిల్లి వేణుగోపాలరావు స్థానిక నారాయణ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయనకు ఎంబీఏ చదువుతున్న ఆదిత్య హర్షిని (22), అమృత వర్షిని (21) ఇద్దరు కుమార్తెలు. నాగుల చవితి సందర్భంగా శుక్రవారం తమ సొంతూరైన చోడవరం మండలం గోవాడ వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

తండ్రి వేణుగోపాలరావుకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆయన ఇంటి వద్దే ఉండిపోయారు. అక్కాచెల్లెళ్లు ఇద్దరే ఉదయం6:30 గంటల సమయంలో స్కూటీపై గోవాడకు బయలుదేరారు.​ చిన్నమ్మాయి అమృత వర్షిని వాహనం నడుపుతుండగా, అక్క ఆదిత్య హర్షిని వెనుక కూర్చుంది. వీరు పీఎంపాలెం దాటి లా-కాలేజ్ జంక్షన్ వద్దకు చేరుకోగానే స్కూటీ ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌న ఢీకొట్టింది.

ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలైన అమృత వర్షిని (21) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. వెనుక కూర్చున్న ఆదిత్య వర్షినికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ట్రాఫిక్ ఎస్ఐ అంపోలు మన్మధరావు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంతో నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. పీఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA