Visakhapatnam: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపిన కార్మికులు
Visakhapatnam: చిట్టివలస జూట్ మిల్లు కార్మికుల గ్రాట్యుటీ బకాయిల విడుదలకు కృషి చేసిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును కార్మికులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
Visakhapatnam: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపిన కార్మికులు
విశాఖపట్నం: గ్రాట్యుటీ బకాయిలు విడుదల చేయించడంలో చొరవ చూపిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు చిట్టివలస జూట్ మిల్లు కార్మికులు కృతజ్ఞతలు తెలియజేశారు. సోమవారం ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో కార్మిక సంఘాల నాయకులు ఆయన్ను కలిశారు.
రూ. 76 లక్షల గ్రాట్యుటీ బకాయిలను అధికారులు ఇటీవల విడుదల చేశారు. అయితే కార్మికుల బకాయిలు విడుదల చేస్తామని గతంలో హామీ ఇచ్చిన జూట్ మిల్లు యాజమాన్యం తీవ్ర జాప్యం చేస్తున్న విషయాన్ని గంటా దృష్టికి తీసుకువెళ్లారు.
తమకు రావాల్సిన బకాయిలు చెల్లించకుండా జూట్ మిల్లు భూములను అమ్ముకోవడానికి సర్వేలు చేస్తున్నారని ఆరోపించారు. ఒకటి, రెండు రోజుల్లో యాజమాన్య ప్రతినిధులను రప్పించి సమస్య పరిష్కరిస్తానని గంటా వారికి హామీ ఇచ్చారు.




