Visakhapatnam: సీఐఐ రీజనల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన జేసీ విద్యాధరి
Visakhapatnam: విశాఖ గంభీరం ఐఐఎంలో ఈనెల 7న జరిగే సీఐఐ రీజనల్ సమ్మిట్ ఏర్పాట్లను జేసీ విద్యాధరి పరిశీలించి, అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.
Visakhapatnam: సీఐఐ రీజనల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన జేసీ విద్యాధరి
విశాఖపట్నం: ఈ నెల 07వ తేదీన గంభీరం ఐఐఎంలో నిర్వహించనున్న సీఐఐ రీజనల్ సమ్మిట్‌కు సంబంధించిన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమ్మిట్‌కు హాజరయ్యే ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
సమ్మిట్ నిర్వహించే ప్రధాన సమావేశ మందిరం, ఇతర సమావేశాల కోసం ఏర్పాటు చేస్తున్న సెషన్ హాళ్లు, ఎగ్జిబిషన్ ప్రాంగణం, ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌తో పాటు ప్రతినిధుల రాకపోకలు, పార్కింగ్, రిజిస్ట్రేషన్, వేదిక, సీటింగ్ తదితర ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
ప్రధాన సమావేశం నిర్వహణలో సమన్వయం అత్యంత కీలకమని, వివిధ విభాగాల అధికారులు, ఈవెంట్ ఏజెన్సీ ప్రతినిధులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి అంశానికి సంబంధించి బాధ్యతలు స్పష్టంగా కేటాయించుకొని, అప్పగించిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేయనున్న స్టాళ్లు, ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌లో ప్రదర్శించనున్న అంశాలు ఆకర్షణీయంగా, సమగ్ర సమాచారాన్ని అందించేలా ఉండాలన్నారు. సమ్మిట్‌కు వచ్చే ప్రతినిధులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు, ఈవెంట్ ఏజెన్సీ ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు.




