Visakhapatnam: జీవీఎంసీ తొలి కౌన్సిల్‌లో 120 మంది కార్పొరేటర్ల ప్రమాణం!
Visakhapatnam: విశాఖ మహా నగరపాలక సంస్థ (జీవీఎంసీ) తొలి కౌన్సిల్‌లో 120 మంది కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ మేయర్‌గా పందిరి వెంకట శివప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Visakhapatnam: జీవీఎంసీ తొలి కౌన్సిల్‌లో 120 మంది కార్పొరేటర్ల ప్రమాణం!
విశాఖపట్నం: అతి పెద్ద కార్పొరేషన్ గా కొలువు దీరిన జీవీఎంసీ తొలి కౌన్సిల్ లో 120 మంది కార్పొరేట్లు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యుటీ మేయర్ గా పందిరి వెంకట శివప్రసాద్ పేరును ఎమ్మెల్యే విష్టుకుమార్ రాజు ప్రపోజ్ చెయ్యగా ఎంపి శ్రీ భరత్ బలపరిచారు.
ఒకే ఒక నామినేషన్ రావడం తో శివప్రసాద్ డిప్యుటీ మేయర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించిన స్పెషల్ ఆఫీసర్ అభిషిక్త కిషోర్. మేయర్ గా గెలిచిన ముక్క శ్రావణి పితృ వియోగం తో ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఆమె ప్రమాణ స్వీకారం నీ వచ్చే కౌన్సిల్ కి వాయిదా వేశారు. ఎక్కువమంది మహిళలు, తొలిసారి గెలిచిన వారు జీవీఎంసీ కౌన్సిల్ లో ప్రమాణ స్వీకారం చేసి వారి పదవి కాలం నీ ప్రారంభించారు.




