Visakhapatnam: మధురవాడ జోన్‌లో జీవీఎంసీ ఎన్నికల సన్నాహాలపై సమీక్ష

Visakhapatnam: మధురవాడ జోన్ కార్యాలయంలో జీవీఎంసీ ఎన్నికల సన్నాహాలపై ఉన్నత స్థాయి సమీక్ష. గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం.

JAI RAM, MADURAWADA
Published on: 16 Sept 2026 11:56 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: మధురవాడ జోన్‌లో జీవీఎంసీ ఎన్నికల సన్నాహాలపై సమీక్ష

విశాఖపట్నం: జీవీఎంసీ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా మధురవాడ జోన్ కార్యాలయంలో అధికారుల ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ (ఏడీసీ) వెంకట రమణ, డీపీవో నాగర్జున పాల్గొని, ఎన్నికల సన్నాహకాలను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు జోన్ పరిధిలో జరుగుతున్న ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్ల జాబితా పరిశీలన, ఇతర క్షేత్రస్థాయి కార్యకలాపాల ప్రగతిని ఉన్నతాధికారులకు సవివరంగా వివరించారు.

​అనంతరం, ఎన్నికల సంబంధిత పనుల పురోగతిపై సీనియర్ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో, నిబంధనలకు లోబడి అన్ని ప్రాధాన్యత పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA