Gajuwaka: జీవీఎంసీ 98వ వార్డు స్వతంత్ర అభ్యర్థి జాజుల నాగేంద్ర విజయోత్సవ ర్యాలీ!

Gajuwaka: విశాఖ జీవీఎంసీ 98వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా ఉంగరం గుర్తుపై గెలుపొందిన జాజుల నాగేంద్ర కుమార్ భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించి, ఉప్పర కాలనీలో మోటర్ బోరు ప్రారంభించారు.

PRAKASH, GAJUWAKA
Published on: 18 Nov 2026 11:45 AM IST
Gajuwaka
X

Gajuwaka: జీవీఎంసీ 98వ వార్డు స్వతంత్ర అభ్యర్థి జాజుల నాగేంద్ర విజయోత్సవ ర్యాలీ!

గాజువాక: జివీఎంసి 98 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి అయిన ఉంగరం గుర్తుపై భారీ మెజార్టీతో గెలుపొంది భారీ ఎత్తున ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రజలు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ చిరునవ్వులతో పలకరిస్తూ మేము నీ వెంటే ఉంటాము బిడ్డ అంటూ అవ్వ తాతల పలకరింపుతో ర్యాలీకి మరింత ఉత్సాహం నింపింది. విజయోత్సవ ర్యాలీలో జాజుల నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ నాపై ఉంచిన నమ్మకానికి నన్ను గెలిపించిన ప్రజలకు పాదాభివందనాలు.

వార్డు అభివృద్ధి తమ ధ్యేయమని ఎలక్షన్స్ సమయంలో ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా పరిశీలించి వాటిని పూర్తిచేసే విధంగా కృషి చేస్తానని అదేవిధంగా ఉప్పర కాలనీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే తన సొంత నిధులతో మోటర్ బోరు వేయించి దాన్ని ప్రారంభించడం జరిగింది. ఉప్పర కాలనీ ప్రజలు హర్షద్వనాలతో జాజులు నాగేంద్రకు ధన్యవాదాలు తెలిపారు.

తనకు విజయానికి అహర్నిశలు సహకరించిన మిత్రబృందం మరియు కుటుంబ సభ్యులు, బంధువులు కూ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ర్యాలీలో భారీ ఎత్తున నాకు విజయాన్ని చేకూర్చిన అభిమానులు వార్డు లోని పెద్దలు వార్డు నలుమూలల నుండి వచ్చిన యువకులకు అందరికీ మరొక్కసారి నా పాదాభివందనాలు.

PRAKASH, GAJUWAKA

PRAKASH, GAJUWAKA