Visakhapatnam: మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
Visakhapatnam: ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు సత్కారం; రూ.20 వేల భరోసా, రూ.9 డీజిల్ సబ్సిడీపై హామీ.
Visakhapatnam: మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
విశాఖపట్నం: ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని మత్స్యకారులు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును శనివారం మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. చేప సహా సంప్రదాయ మత్స్యకారులు ఉపయోగించే వలలు, బుట్ట బహూకరించారు.
ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ వేట నిషేధ సమయంలో మత్స్యకార భరోసా కింద ప్రభుత్వం ఏటా రూ. 20 వేల ఆర్థిక సాయం అందజేస్తోందని తెలిపారు. లీటరుకు రూ.9 చొప్పున డీజిల్ సబ్సిడీ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
అధునాతన పరికరాలు అందించడంతో పాటు వేట సమయంలో ప్రమాదాల నివారణకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో మత్స్యకార నాయకులు సి.టి. శంకర్, చుక్కా భాస్కర్, కర్రి ఎర్రయ్య, మేరుగు అమర్నాథ్, చీపుళ్ల శ్రీను, సూరాడ రవి, మైలపల్లి రాము, పుక్కళ్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు.




