Visakhapatnam: ఈ నెల 13, 14 తేదీల్లో విశాఖలో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ పర్యటన!
Visakhapatnam: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ నవంబర్ 13, 14 తేదీల్లో విశాఖపట్నంలో పర్యటన. సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ముగింపు వేడుకల్లో పాల్గొనే అవకాశం.
Visakhapatnam: ఈ నెల 13, 14 తేదీల్లో విశాఖలో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ పర్యటన!
Visakhapatnam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ ఈ నెల 13, 14 తేదీల్లో విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నవంబర్ 13న మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నంలోని ఐఎన్‌ఎస్ డేగా విమానాశ్రయానికి చేరుకొని, సాయంత్రం 3.15 గంటలకు భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌కు స్వాగతం పలకనున్నారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చేరుకుని సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు జరిగే 30వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు.
కార్యక్రమం అనంతరం సాయంత్రం 5.35 గంటలకు ఐఎన్‌ఎస్ డేగా విమానాశ్రయంలో ఉపరాష్ట్రపతికి వీడ్కోలు పలికి, తిరిగి నోవోటెల్ వరుణ్ బీచ్‌కు చేరుకుంటారు. 14న నోవాటెల్ లో ఉదయం 5.25 కు బయలుదేరి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు.




