Visakhapatnam: ఆరిలోవ మహిళా సంక్షేమ హాస్టల్ నుంచి ఐదుగురు యువతుల పరారీ
Visakhapatnam: విశాఖ ఆరిలోవ మహిళా సంక్షేమ హాస్టల్ నుంచి కిటికీ గ్రిల్స్ కట్ చేసి ఐదుగురు యువతులు పరారయ్యారు. వీరిలో విదేశీయులు ఉండటంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Visakhapatnam: ఆరిలోవ మహిళా సంక్షేమ హాస్టల్ నుంచి ఐదుగురు యువతుల పరారీ
విశాఖపట్నం: మహిళా సంక్షేమ హాస్టల్ నుంచి ఐదుగురు యువతుల పరారీ, కిటికీ గ్రిల్స్ కట్ చేసి బయటకు వెళ్లినట్లు సమాచారం. ఒకేసారి ఐదుగురు యువతులు మాయమవ్వడంతో కలకలం. పరారైన వారిలో ఇద్దరు బంగ్లాదేశ్ యువతులు. ఇద్దరు యువతులు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారిగా గుర్తింపు.
మరో యువతి పశ్చిమ బెంగాల్‌కు చెందినదిగా సమాచారం. ముందస్తు ప్రణాళికతోనే పరారయ్యారా? కిటికీ గ్రిల్స్‌ను ఎలా కట్ చేశారు? ఘటనపై హాస్టల్ భద్రతపై అనుమానాలు, సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, హాస్టల్ పరిసరాల్లో సీసీ కెమెరాల ఫుటేజీల పరిశీలన యువతుల ఆచూకీ కోసం పోలీసుల దర్యాప్తు ముమ్మరం...




