Visakhapatnam: ఏపీఈపీడీసీఎల్ కాల్‌సెంటర్‌ను తనిఖీ చేసిన మంత్రి గొట్టిపాటి

Visakhapatnam: విశాఖలో ఈపీడీసీఎల్ కాల్‌సెంటర్‌ను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వినియోగదారులతో మాట్లాడి సేవలపై ఆరా తీశారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 5 Oct 2026 8:01 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: ఏపీఈపీడీసీఎల్ కాల్‌సెంటర్‌ను తనిఖీ చేసిన మంత్రి గొట్టిపాటి

విశాఖపట్నం: ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేపట్టిన మంత్రి గొట్టిపాటి. ఈపీడీసీఎల్ పరిధిలో ఏర్పాటు చేసిన 1912 కాల్ సెంటర్ పనితీరును పరిశీలించిన మంత్రి.

1912 ఫిర్యాదుల నమోదు కేంద్రంలో వినియోగదారులతో లైవ్ లో మాట్లాడిన మంత్రి గొట్టిపాటి. ఫిర్యాదు నమోదు చేసిన వ్యక్తి నుంచి శాఖ పని తీరుపై అభిప్రాయాన్ని సేకరించిన మంత్రి.

తుపాను సమయంలో విద్యుత్ శాఖ అధికారుల స్పందనపై సంతృప్తి వ్యక్తం చేసిన వినియోగదారుడు. .40 ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యను తీర్చినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన వినియోగదారుడు

కాల్ సెంటర్ పనితీరు, సిబ్బంది స్పందించిన తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి గొట్టిపాటి. వినియోగదారుల సంతృప్తి స్థాయి పెంచేలా విద్యుత్ శాఖ సిబ్బంది పని చేయాలని మంత్రి గొట్టిపాటి ఆదేశం. ప్రకృతి విపత్తుల సమయంలో విద్యుత్ శాఖ అధికారులు స్పందిస్తున్న విధానం అభినందనీయం.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.