Madhurawada: జీవీఎంసీ 7వ వార్డులో దేవర మహేశ్వరి తరఫున కూటమి ప్రచారం!

Madhurawada: మధురవాడ జీవీఎంసీ 7వ వార్డులో కూటమి అభ్యర్థి దేవర మహేశ్వరి ప్రచారం. గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరిన మొల్లి లక్ష్మణరావు, దేవర శివ.

JAI RAM, MADURAWADA
Published on: 24 Oct 2026 10:59 PM IST
Madhurawada
X

Madhurawada: జీవీఎంసీ 7వ వార్డులో దేవర మహేశ్వరి తరఫున కూటమి ప్రచారం!

మధురవాడ: జీవీఎంసీ పరిధిలోని నూతన 7వ వార్డులో కూటమి అభ్యర్థి దేవర మహేశ్వరి తరఫున కూటమి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్వతంత్రనగర్, శివశక్తినగర్, వైఎస్సార్ కాలనీ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను కలిశారు.

అభ్యర్థి దేవర మహేశ్వరి తరఫున ఆమె భర్త దేవర శివ, టీడీపీ సీనియర్ నాయకుడు మొల్లి లక్ష్మణరావు, నమ్మి శ్రీను ఆధ్వర్యంలో ప్రచారం కొనసాగింది. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి ఎన్నికల గుర్తు గాజు గ్లాసుకు ఓటు వేసి మద్దతు తెలపాలని ప్రజలను కోరారు.

వార్డును సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అభ్యర్థి దేవర మహేశ్వరి తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA