Visakhapatnam: వాయుగుండం ప్రభావం: ప్రత్యేక అధికారుల నియామకం!

Visakhapatnam: వాయుగుండం తీవ్రత నేపథ్యంలో విశాఖ జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ నియోజకవర్గాలు, మండలాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 25 Oct 2026 9:23 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: వాయుగుండం ప్రభావం: ప్రత్యేక అధికారుల నియామకం!

విశాఖపట్నం, అక్టోబర్ 25: తీవ్ర వాయుగుండం నేపథ్యంలో జిల్లాలో భారీ వర్షాలు, విపత్తు నిర్వహణ చర్యలను పర్యవేక్షించేందుకు మండలాల వారీగా ప్రత్యేక అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే వివిధ శాఖల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులకు అదనంగా ఈ బాధ్యతలు అప్పగించారు.

నియమిత ప్రత్యేక అధికారులు - ఫోన్ నంబర్లు:

భీమిలి నియోజకవర్గం ః భీమునిపట్నం ఆర్డీఓ - 9849903854

విశాఖపట్నం తూర్పు: ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -9848355128

విశాఖపట్నం దక్షిణం: విశాఖపట్నం ఆర్డీఓ -9849903825

విశాఖపట్నం ఉత్తరం: జిల్లా సహకార అధికారి -9100109164

విశాఖపట్నం పశ్చిమం: జిల్లా పర్యాటక అధికారి -9000013610

గాజువాక: వీఎంఆర్‌డీఏ ఎస్టేట్ అధికారి -63099444449

పెందుర్తి: జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి -9849902145

ఆనంద‌పురం ః జెడ్‌ఎం, ఏపీఐఐసీ -9848933874

పద్మనాభం ః స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ -9494918484

విశాఖపట్నం రూరల్ మండలానికి ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మహారాణిపేట మండలానికి విశాఖపట్నం ఆర్డీఓ, సీతమ్మధార మండలానికి జిల్లా సహకార అధికారి, గోపాలపట్నం మండలానికి జిల్లా పర్యాటక అధికారి, ములగాడ మండలానికి వీఎంఆర్‌డీఏ ఓఎస్‌డీ (7992416144), గాజువాక మండలానికి వీఎంఆర్‌డీఏ ఎస్టేట్ అధికారి, పెదగంట్యాడ మండలానికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (9849903829) పర్యవేక్షణ బాధ్యతలు చేపడతారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, వర్షాలు, వాయుగుండం ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.