Visakhapatnam: అప్పికొండలో బెల్ట్ షాపుపై సీటీఎఫ్ పోలీసుల దాడి!
Visakhapatnam: విశాఖ భీమిలి పరిధి అప్పికొండలో అక్రమ బెల్ట్ షాపుపై సీటీఎఫ్ పోలీసులు దాడి చేసి, 54 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని నిందితుడిని అప్పగించారు.
Visakhapatnam: అప్పికొండలో బెల్ట్ షాపుపై సీటీఎఫ్ పోలీసుల దాడి!
Visakhapatnam: భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అప్పికొండ వీధిలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపుపై సిటీ టాస్క్ ఫోర్స్ (CTF) పోలీసులు శుక్రవారం మెరుపు దాడి చేశారు.
అప్పికొండ వీధిలో అక్రమంగా బెల్ట్ షాపు నిర్వహిస్తూ మద్యం విక్రయిస్తున్నట్లు సిటీఎఫ్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన సిటీఎఫ్ బృందం ఆ ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేసి మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని గుర్తించారు.
అనంతరం బెల్ట్ షాపుపై దాడి చేసి తనిఖీలు నిర్వహించగా 54 క్వార్టర్ మద్యం సీసాలు లభించాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని, మద్యం విక్రయిస్తున్న వ్యక్తితో పాటు మద్యం సీసాలను భీమిలి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నారు.
అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ మద్యం విక్రయాలు, గంజాయి వంటి వాటికి సంబంధించిన సమాచారం ప్రజల దృష్టికి వస్తే వెంటనే సిటీఎఫ్ పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని అధికారులు కోరారు.




