Visakhapatnam: గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ
Visakhapatnam: విశాఖ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. డీసీసీ అధ్యక్షుడు అడ్డాల వెంకట వర్మ రాజు నివాళులర్పించారు.
Visakhapatnam: గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ
విశాఖపట్నం: మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను పురస్కరించుకుని విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు అడ్డాల వెంకట వర్మ రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ మెంబర్ వేగి వెంకటేష్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం వెంకట వర్మ రాజు మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ దేశానికి సత్యం, అహింస, శాంతి, ఐక్యత మార్గాలను చూపిన మహనీయుడని అన్నారు. ప్రజలందరూ ఐక్యంగా ఉంటే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించగలమనే నమ్మకాన్ని గాంధీజీ దేశ ప్రజల్లో కల్పించారని పేర్కొన్నారు.




