Madhurawada: బీటెక్ విద్యార్థి గణేష్ వర్మ ఆత్మహత్య
Madhurawada: మధురవాడలో బీటెక్ విద్యార్థి గణేష్ వర్మ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహం కుళ్లిన స్థితిలో లభించగా, సూసైడ్ నోట్ లభించింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Madhurawada: బీటెక్ విద్యార్థి గణేష్ వర్మ ఆత్మహత్య
మధురవాడ: మిధిలాపురి ఉడా కాలనీలోని రాచకొండ అపార్ట్‌మెంట్‌లో గణేష్ వర్మ (19) అనే బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుమారు ఐదు రోజుల క్రితమే ఈ ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతదేహం డీకంపోజ్ అయిన స్థితిలో గుర్తించారు. సమాచారం అందుకున్న పీఎం పాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.
ఘటనా స్థలంలో అమ్మా, నాన్నా క్షమించండి అని రాసిన లేఖ ఉంది. మృతుడు గణేష్ వర్మ బాబా కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నట్లు తెలిసింది. అతడి స్వగ్రామం బాపట్ల, గుంటూరు జిల్లా. ఘటనపై పీఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




