Bheemili: భీమిలి ఎమ్మెల్యే గంటా స్ఫూర్తితో పట్టణ అభివృద్ధి: గంటా నూకరాజు!
Bheemili: అభివృద్ధికి, ప్రజాసేవకు కేరాఫ్ అడ్రస్ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అని టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి గంటా నూకరాజు అన్నారు. 3వ వార్డుకు 18 హైమాస్ట్ లైట్లు మంజూరయ్యాయని తెలిపారు.
Bheemili: భీమిలి ఎమ్మెల్యే గంటా స్ఫూర్తితో పట్టణ అభివృద్ధి: గంటా నూకరాజు!
భీమిలి: భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గంటా నూకరాజు మీడియాతో మాట్లాడారు. 2021 జీవిఎంసీ ఎన్నికల్లో భీమిలి జోన్ 3వ డివిజన్ నుండి అత్యధిక మెజారిటీతో కార్పొరేటర్ గా గెలిచిన శ్రీమతి గంటా అప్పలకొండ విజ్ఞప్తి మేరకు 3వ వార్డులో పలు ప్రాంతాల్లో హైమాక్ష్ లైట్లు వేయాలని కోరిన మేరకు అడిగిన క్షణమే 18 లైట్లు మంజూరు చేయించిన ఘనత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుది అని అన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకి మా తరపున, భీమిలి పట్టణ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. 2014-19 కాలంలో భీమిలి నియోజకవర్గంలో అభివృద్ధికి అధిక నిధులు ఖర్చుచేసిన ఘనత గంటా సార్ కే దక్కుతుందని అన్నారు. అందులో అధిక నిధులు 3వ వార్డుకి ప్రాతినిధ్యం వహించిన నాటి కార్పొరేటర్ గంటా అప్పలకొండ వార్డు అభివృద్ధికి ఎంతో ఉపయోగ పడ్డాయని అన్నారు. ఏ గ్రామంలో చూసిన సామాజిక భవనాలు, సామూహిక మరుగుదొడ్లు, సిసి రోడ్డు, కాలువలు, కల్వర్టులు దర్శనమిస్తాయని అన్నారు.
అదేవిదంగా 2024 ఎన్నికల్లో 90 వేలకు పైగా మెజారిటీతో గెలిచిన గంటా సార్ అదే ఒరవడిని కొనసాగిస్తూ ఎక్కడా రాజీ పడకుండా అభివృద్ధికి పునాదులు వేస్తున్నారని అన్నారు. అభివృద్ధి అంటే గంటా.. గంటా అంటే అభివృద్ధి అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ఎమ్మెల్యే గంటా సార్ అని అన్నారు.
అదేవిదంగా నాటి 3వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి గంటా అప్పలకొండ కోరిక మేరకు పలు కేంద్రాల్లో హైమాక్ష్ లైట్లు కావాలని విజ్ఞప్తి చేస్తే చిన్నబజారు జంక్షన్, ఎమ్మెల్యే గారి కార్యాలయం ఎదురుగా, అనిల్ ప్రసాద్ జంక్షన్, కృష్ణాకోలనీ జంక్షన్, అప్పికొండ వీధి జంక్షన్, నేరళ్లవలస కోలనీ, జలగెడ్డ స్మశానవాటిక, గాడువీధి స్మశానవాటిక, మున్సిపల్ హై స్కూల్ జంక్షన్, తోటవీధి సంపత్ వినాయక జంక్షన్, బోయవీధి రామాలయం జంక్షన్, ఎమ్ఆర్వో ఆఫీస్ జంక్షన్, రెల్లివీధి జంక్షన్, గనగళ్ల వీధి జంక్షన్,
భీమిలి మున్సిపల్ ఆఫీస్ దగ్గర, కొంకివీధి, గొల్లవీధి జంక్షన్, ఎన్టీఆర్ స్టేడియంలలో వేయుటకు 18 హైమాక్స్ లైట్లు మంజూరు అయ్యాయని అన్నారు. ప్రస్తుతం పనులు ముగింపు దశకు చేరుకున్నాయని అన్నారు. మరొక వారం రోజుల్లో వార్డు వెలుగులమయం కావస్తుందని అన్నారు. వార్డు అభివృద్ధికి పూర్తిగా సహకరించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకి హృదయపూర్వక ధన్యవాదములు అని గంటా నూకరాజు అన్నారు.




