Visakhapatnam: గంటా సమక్షంలో టీడీపీలో చేరిన ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యురాలు!
Visakhapatnam: భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమక్షంలో సింహాచలం ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యురాలు సిరిపురపు ఆశారాణి 100 మంది అనుచరులతో వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలో చేరారు.
Visakhapatnam: గంటా సమక్షంలో టీడీపీలో చేరిన ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యురాలు!
విశాఖపట్నం, అక్టోబర్ 22: భీమిలి నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. సింహాచలం చాకిరేవు కొండకు చెందిన సింహాచలం ట్రస్టు బోర్డు మాజీ సభ్యురాలు సిరిపురపు ఆశారాణి, ఆమె భర్త కృష్ణ నేతృత్వంలో 100 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమక్షంలో గురువారం పార్టీలో చేరారు.
వీరందరికీ పసుపు కండువాలు కప్పి గంటా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయిదేళ్ల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని వైసీపీపై ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టిన సీఎం చంద్రబాబు నాయకత్వం పట్ల ఆకర్షితులై వైసీపీ నుంచి పెద్దఎత్తున వలస వస్తున్నారని చెప్పారు.
గడిచిన రెండేళ్లలో భీమిలి నియోజకవర్గంలో రూ. 2,900 కోట్లతో అభివృద్ధి ప్రాజెక్టులు పట్టా జరిగిందన్నారు. భీమిలి, మధురవాడ జోన్ లలో రూ. 400 కోట్లతో మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. 120 వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి పీవీ నరసింహాన్ని గతం కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించాలన్నారు. చాకిరేవు కొండ ప్రాంతంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భీమిలి పార్టీ ఇంచార్జ్ చిక్కాల విజయ్ బాబు, మాజీ కార్పొరేటర్ పీవీ నరసింహం తదితరులు పాల్గొన్నారు.




