Visakhapatnam: మధురవాడ 7వ వార్డులో తుఫాన్ ప్రభావం.. టీడీపీ నేతల పర్యటన!
Visakhapatnam: భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశాలతో మధురవాడ 7వ వార్డులో టీడీపీ నేతల పర్యటన: వర్షాలకు నేలకొరిగిన చెట్లు, నీటమునిగిన ఇళ్ల పరిశీలన, తక్షణ సహాయ చర్యలు.
Visakhapatnam: మధురవాడ 7వ వార్డులో తుఫాన్ ప్రభావం.. టీడీపీ నేతల పర్యటన!
విశాఖపట్నం: మధురవాడ మాజీ మంత్రులు భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాసరావు గారు మరియు యువనాయకులు శ్రీ గంటా రవితేజ గారు అదేశాలతో
తుఫాన్ కారణంగా 7వ వార్డులో పర్యటన
తుఫాన్ కారణంగా 7వ వార్డులో భారీ వర్షాలకు చెట్లు నేలకొరిగి, పలు ఇళ్లలోకి నీరు చేరడంతో పరిస్థితిని పరిశీలించేందుకు 5వ వార్డు అధ్యక్షులు శ్రీ నాగోతి సత్యనారాయణ గారు, 7వ వార్డు అధ్యక్షులు శ్రీ కనూరి అచ్యుతరావు గారు, 7వ వార్డు సీనియర్ నాయకులు జె.పి. రాజు గారు పర్యటించారు.
ఈ సందర్భంగా కార్యకర్తలు దానేటి ఉమాశంకర్, సాయి, నాగరాజు, మురళి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. దెబ్బతిన్న రహదారులకు త్వరితగతిన మరమ్మతులు చేపడతామని, అలాగే ఇళ్లపైకి వాలిన ప్రమాదకరమైన చెట్లను తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని నాయకులు హామీ ఇచ్చారు.




