Arilova: ఆరిలోవలో రౌడీషీటర్లకు సీఐ శ్రీనివాస్ కౌన్సెలింగ్

Arilova: విశాఖపట్నం ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు సీఐ ఎస్. శ్రీనివాస్ కౌన్సెలింగ్ నిర్వహించి, నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు.

JAI RAM, MADURAWADA
Published on: 11 Oct 2026 5:38 PM IST
Arilova
X

Arilova: ఆరిలోవలో రౌడీషీటర్లకు సీఐ శ్రీనివాస్ కౌన్సెలింగ్

విశాఖపట్నం: ఆరిలోవ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రౌడీషీటర్లకు ఆరిలోవ సీఐ ఎస్.శ్రీనివాస్ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎవరూ నేర కార్యకలాపాలకు పాల్పడవద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

నేరాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. కౌన్సెలింగ్‌లో భాగంగా పీడీ యాక్ట్‌ (PD Act), పిట్‌ ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ (PIT NDPS Act) గురించి వివరించి, ఆయా చట్టాలపై అవగాహన కల్పించారు.

రౌడీషీటర్లు నేర ప్రవృత్తిని విడనాడి, సమాజంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA