Visakhapatnam: భీమిలి పరిధిలో 17 ఏళ్ల బాలిక అదృశ్యం - పోలీసుల గాలింపు

Visakhapatnam: విశాఖ భీమిలి పరిధిలో ఇంటర్ విద్యార్థిని నవ్యశ్రీ అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలని కోరారు.

SHIVA, BHIMILI
Published on: 9 Oct 2026 9:28 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: భీమిలి పరిధిలో 17 ఏళ్ల బాలిక అదృశ్యం - పోలీసుల గాలింపు

విశాఖపట్నం: విశాఖపట్నం నగరంలోని భీమునిపట్నం మండలం, తగరపువలస గొల్లవీధికి చెందిన జామి నవ్యశ్రీ (17) అనే బాలిక అదృశ్యమైనట్లు భీమిలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. ఫిర్యాదుదారు జామి గుణ సత్యవతి తెలిపిన వివరాల ప్రకారం, ఆమె కుమార్తె జామి నవ్యశ్రీ బసరా కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం బైపీసీ చదువుతోంది.

29-09-2026 తేదీ తెల్లవారుజామున సుమారు 3:30 గంటలకు ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో, బంధువుల వద్ద వెతికినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు.

అదృశ్యమైన బాలిక వివరాలు: వయస్సు 17 సంవత్సరాలు, ఎత్తు సుమారు 5 అడుగుల 3 అంగుళాలు, సాధారణ చర్మవర్ణం. అదృశ్యమైన సమయంలో నేవీ బ్లూ రంగు టాప్, బ్లూ రంగు జీన్స్ ధరించి ఉంది. ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా భీమిలి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరడమైనది.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI