Anandapuram: ఆనందపురంలో కోడిపందాలు ఆడుతున్న 13 మంది జూదరుల అరెస్ట్
Anandapuram: ఆనందపురం మండలం దుక్కవానిపాలెంలో కోడిపందాలు ఆడుతున్న 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నగదు, కోడిపుంజులు స్వాధీనం.
Anandapuram: ఆనందపురంలో కోడిపందాలు ఆడుతున్న 13 మంది జూదరుల అరెస్ట్
ఆనందపురం: ఆనందపురం మండలం దుక్కవానిపాలెం సమీపంలో ఐఏఎం ప్రహరీ గోడ పక్కన కోడిపందాలు ఆడుతున్న 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
ఆనందపురం సీఐ ఎర్రం నాయుడు కు అందిని సమాచారం మేరకు ఎస్‌ఐ హరీష్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా డబ్బులు పందెంగా పెట్టి కోడిపందాలు ఆడుతున్న 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు కోడి పుంజులు, రూ.1,950 నగదు స్వాధీనం చేసుకున్నారు.
కేసును సీఐ ఎర్రం నాయుడు పర్యవేక్షణలో హెడ్ కానిస్టేబుల్ పార్థసారథికి అప్పగించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.




