Visakhapatnam: వీరగున్నమ్మపురంలో ఘనంగా జిల్లా స్థాయి క్విజ్ పోటీలు!
Visakhapatnam: వీరగున్నమ్మపురంలో వినాయక నవరాత్రుల సందర్భంగా ఘనంగా జిల్లా స్థాయి క్విజ్ పోటీలు. విజేతలకు బహుమతులు అందజేసిన దాతలు, పెద్ద సంఖ్యలో విద్యార్థుల భాగస్వామ్యం.
Visakhapatnam: వీరగున్నమ్మపురంలో ఘనంగా జిల్లా స్థాయి క్విజ్ పోటీలు!
విశాఖపట్నం: వీరగున్నమ్మపురం, గ్రామంలో ఎంతో వైభవంగా జరుగుతున్న శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి పూజా మహోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్విజ్ పోటీలు విద్యార్థులలో ఉత్తేజం నింపాయి. AA కోచింగ్ సెంటర్ డైరెక్టర్ హనుమంతు ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జ్ఞాన సమరంలో జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.
పోటీలలో ప్రతిభ కనబరిచిన విజేతల వివరాలు:
ప్రథమ బహుమతి: ఎర్రముక్కం హైస్కూల్ టీమ్, ద్వితీయ బహుమతి: హరిపురం హైస్కూల్ టీమ్, తృతీయ బహుమతి: లోహరిబంధ హైస్కూల్ టీమ్.
ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన బహుమతి దాతలు గొర్లె హరీష్ (ప్రథమ బహుమతి దాత), V. ధర్మారావు (ద్వితీయ బహుమతి దాత), S. గోపికృష్ణ (తృతీయ బహుమతి దాత)ల చేతుల మీదుగా గెలుపొందిన టీమ్‌లకు బహుమతులు మరియు ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా నిర్వహకులు మాట్లాడుతూ పండుగ మహోత్సవాలలో ఇలాంటి విజ్ఞానదాయకమైన పోటీలు నిర్వహించడం ద్వారా విద్యార్థులలో పోటీతత్వం, సాధారణ జ్ఞానం పెరుగుతాయని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వరసిద్ధి వినాయక పూజా కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




