Pendurthi: పెందుర్తిలో ఘనంగా వరుణ యాగం వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు!

Pendurthi: పెందుర్తిలో ఎల్ నినో ప్రభావం తొలగి వర్షాలు కురవాలని కోరుతూ టీడీపీ నాయకులు, చైర్మన్లు గండి బాబ్జి, వేగి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో వరుణ యాగం నిర్వహించారు.

GOPI, PENDURTHI
Published on: 5 Oct 2026 3:50 PM IST
Pendurthi
X

Pendurthi: పెందుర్తిలో ఘనంగా వరుణ యాగం వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు!

Pendurthi: ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆదేశాలతో విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ఏపీ ఆయిల్ పెడ్ చైర్మన్ గండి బాబ్జి, గవర కార్పొరేషన్ చైర్మన్ వేగి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో పెందుర్తి వెంకటాద్రిపై సోమవారం ఉదయం వరుణ యాగం వైభవంగా జరిగింది. వేద పండితులు మహర్తి రామానుజాచార్యులు ఆధ్వర్యంలో పండితులు విశ్వక్సేనారాధన, యాగం హోమం జపాదులు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. బాబ్జి దంపతులు, సహా తెలుగుదేశం నాయకులు పెద్ద సంఖ్యలో హోమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బాబ్జి మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం నుండి ప్రజలను రక్షించడం వర్షాలు విరివిగా పడి పంటలు బాగా పండి పాడిపంటలు వృద్ధి చెందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఈ హోమం జరిపించినట్లు వెల్లడించారు. హోమం అనంతరం భారీగా వర్షాలు పడతాయని ఆకాంక్షను వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ కోరుబిల్లి సుందర్రావు, ముక్క సంతోష్ ఆలయ కమిటీ మెంబర్లు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI