Butchayyapeta: వడ్డాది వద్ద రోడ్డు ప్రమాదం: ఆర్‌ఎంపీ డాక్టర్ మృతి

Butchayyapeta: బుచ్చయ్యపేట మండలం వడ్డాది శివారులో ఆగివున్న బియ్యం లోడు లారీని పల్సర్ బైక్ ఢీకొన్న ఘటనలో విజయరామరాజుపేటకు చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు అమిత్ కుమార్ మృతి చెందారు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 12 Oct 2026 3:52 PM IST
Butchayyapeta
X

Butchayyapeta: వడ్డాది వద్ద రోడ్డు ప్రమాదం: ఆర్‌ఎంపీ డాక్టర్ మృతి

Butchayyapeta: బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డాది గ్రామ శివారులో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

శ్రీలలిత బ్రాండ్ బియ్యం ప్యాకెట్లను లోడ్ చేసుకుని వచ్చిన నంబర్ గల లారీని గోడౌన్ వద్ద బియ్యం అన్‌లోడింగ్ కోసం రోడ్డుపై నిలిపి ఉంచారు. అదే సమయంలో విజయరామరాజుపేట గ్రామానికి చెందిన దొడ్డి అమిత్ కుమార్ (43), RMP వైద్యుడు, పల్సర్ మోటార్ సైకిల్ పై వెళ్తుండగా, రోడ్డుపై నిలిపి ఉన్న లారీని వెనుక వైపు నుంచి ఢీకొట్టారు.

ఈ ప్రమాదంలో అమిత్ కుమార్‌కు తీవ్ర తల గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

సమాచారం అందుకున్న వెంటనే బుచ్చయ్యపేట ఎస్‌ఐ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని చోడవరం ఆసుపత్రికి తరలించి, రహదారిపై ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM