Chodavaram: వడ్డాది కస్తూరిబా పాఠశాలలో ఎస్‌ఎంసీ ఎన్నికలు వాయిదా
Chodavaram: బుచ్చయ్యపేట మండలం వడ్డాది కస్తూరిబా పాఠశాలలో కూటమి, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఎస్‌ఎంసీ ఎన్నికలను అధికారులు వాయిదా వేశారు.
Chodavaram: వడ్డాది కస్తూరిబా పాఠశాలలో ఎస్‌ఎంసీ ఎన్నికలు వాయిదా
అనకాపల్లి జిల్లా: చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం వడ్డాదిలోని కస్తూరిబా పాఠశాలలో ఎస్‌ఎంసీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. సుమారు 280 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో.. ఎన్నికలకు అవసరమైన కోరం మేరకు ఓటర్లు హాజరయ్యారు.
అయితే.. అభిప్రాయాలను చేతులు ఎత్తి తెలిపే సమయంలో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో కూటమి, వైసీపీ నేతలు, కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కూటమి తరఫున డెయిరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ ఎన్నికల ప్రాంతానికి చేరుకోగా.. అప్పటికే మాజీ జడ్పీటీసీ, వైసీపీ నేత దొండ రాంబాబు అక్కడికి చేరుకున్నారు.
ఇరువర్గాల నేతలు ఒకే ప్రాంతంలో ఉండటంతో పాఠశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాగ్వాదం కొనసాగుతుండగానే ఎన్నికల సమయం ముగియడంతో అధికారులు ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పాఠశాల వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా అక్కడ ఉన్న వారందరినీ అక్కడి నుంచి పంపించారు. ఎన్నికలు వాయిదా పడటంతో ఎస్‌ఎంసీ ఎన్నికల కోసం వచ్చిన తల్లిదండ్రులు నిరాశతో వెనుదిరిగారు.




