Anakapalli: అనకాపల్లిలో త్వరలో ప్రత్యేక ఎల్‌ఎల్‌ఆర్ మేళా: ఎమ్మెల్యే కొణతాల!

Anakapalli: అనకాపల్లిలో ప్రత్యేక ఎల్‌ఎల్‌ఆర్ మేళా నిర్వహణపై ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణతో డీటీవో మనోహర్, ఎంవీఐ కాశీ విశ్వనాథ్ భేటీ అయి సాధ్యాసాధ్యాలపై చర్చించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 16 Sept 2026 11:47 PM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లిలో త్వరలో ప్రత్యేక ఎల్‌ఎల్‌ఆర్ మేళా: ఎమ్మెల్యే కొణతాల!

అనకాపల్లి: నియోజకవర్గంలోని అర్హులైన అభ్యర్థులకు లెర్నర్స్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ సేవలను సులభతరం చేసేందుకు ప్రత్యేక ఎల్‌ఎల్‌ఆర్ మేళా నిర్వహించే అంశంపై రవాణా శాఖ అధికారులు అనకాపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణతో చర్చించారు.

అనకాపల్లి నియోజకవర్గంలో అర్హులైన యువత, వాహనదారులకు లెర్నర్స్ లైసెన్స్‌తో పాటు ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల డ్రైవింగ్ లైసెన్స్ పొందేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించే సాధ్యాసాధ్యాలపై అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు.

ప్రజలకు రవాణా శాఖ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు, లైసెన్స్ ప్రక్రియపై అవగాహన కల్పించడం, రోడ్డు భద్రతా నిబంధనలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది.

ఈ కార్యక్రమం ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా నిర్వహించేందుకు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సానుకూలంగా స్పందించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారి జి. మనోహర్, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఎం. కాశీ విశ్వనాథ్ పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI