Devarapalli: రైవాడలో కుటుంబ కలహాలతో ముగ్గురి ఆత్మహత్యాయత్నం!
Devarapalli: దేవరాపల్లి మండలం రైవాడలో కుటుంబ కలహాలతో అత్త, కొడుకు, కోడలు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం. తీవ్ర గాయాలవ్వడంతో ముగ్గురినీ విశాఖ కేజీహెచ్‌కి తరలింపు.
Devarapalli: రైవాడలో కుటుంబ కలహాలతో ముగ్గురి ఆత్మహత్యాయత్నం!
Devarapalli: స్థానికుల కథనం ప్రకారం ఈ ఘనటకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. రైవాడకు చెందిన చల్లా ఈశ్వరరావు (43) అలియాస్ బుజ్జికి చోడవరం మండలం గంధవరంకి చెందిన నాగమణి (35)తో సుమారు పదిహేనేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి నవ్య, సాహిత్ అనే ఇద్దరు పిల్లలున్నారు.
రైవాడలో వీరితో పాటు ఈశ్వరరావు తల్లి వరహాలమ్మ (60) ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు. భార్య, భర్తతో పాటు అత్తతో తరచూ గొడవలు జరిగేవని నాగమణి సోదరుడు పైడిరాజు తెలిపారు.
అనేక సార్లు తగాదాలు జరగడంతో చోడవరం, దేవరాపల్లి పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. రెండేళ్ల నుంచి తన సోదరుడి ఇంటి వద్దే ఉన్న నాగమణిని వారం రోజుల కిందట
గంధవరంలో ఉన్న కోడలిని అత్త స్వయంగా అక్కడకు వెళ్లి తీసుకొచ్చింది. ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో తల్లి, కొడుకు, కోడలి మధ్య మరలా తగాదా జరిగింది. ఆ సమయంలో ఇంటిలో ఉన్న ఇద్దరు పిల్లల్ని ఈశ్వరరావు బయటకు పంపించి తలుపులు వేశాడు.
గొడవ తారా స్థాయికి చేరడంతో ముగ్గరు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యానికి పాల్పడ్డాని తెలిసింది. ముగ్గురు మంటల్లో చిక్కుకుని హాహాకారాలు చెయ్యడంతో ఇంటి పక్కనే నివాసం ఉంటున్న ఈశ్వరరావు అన్నయ్య చల్లా రాంబాబు, చల్లా నాయుడు తదిలరులొచ్చి తలుపులు పగలగొట్టి మంటల్లో చిక్కుకున్న ముగ్గుర్ని రక్షించారు.
అనంతరం వారి ముగ్గురిని 108 వాహనంలో కె.కోటపాడు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం విశాఖ కెజీహెచ్కి తరలించారు. ఈ ముగ్గురిలో ఎవరు, ఎవరిపై పెట్రోలు వేశారు. ఆ సమయంలో అక్కడకు పెట్రోలు ఎలా వచ్చిందనే విషయం పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.




