Pedagantyada: విశాఖ విమల విద్యాలయాన్ని ప్రభుత్వ పాఠశాలగా మార్చాలి!
Pedagantyada: పెదగంట్యాడ విశాఖ విమల విద్యాలయాన్ని ప్రభుత్వ పాఠశాలగా మార్చాలని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావును కోరిన ఉపాధ్యాయులు.
Pedagantyada: విశాఖ విమల విద్యాలయాన్ని ప్రభుత్వ పాఠశాలగా మార్చాలి!
Pedagantyada: పెదగంట్యాడ విశాఖ విమల విద్యాలయం పాఠశాలను ప్రభుత్వ పాఠశాలగా మార్చాలని స్థానిక గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారిని, గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉపాధ్యాయులు కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా గారితో ఉపాధ్యాయులు మాట్లాడుతూ, ఉక్కు నిర్వాసిత గ్రామాల్లో ఉన్న మా పాఠశాలలో నిర్వాసిత ప్రాంత పిల్లలు, కాంట్రాక్టు కార్మికులు పిల్లలు చదువుతున్నారని, ప్రస్తుతం విద్యార్థులు ఫీజులు కూడా కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని, సుమారు 13 ఎకరాల స్థలంలో క్రీడా మైదానం, తరగతి గదులు, విద్యార్థులకు కావలసిన అన్ని వసతులు కలిగిన, ప్రశాంతమైన వాతావరణం ఉన్న ఈ పాఠశాలను, ప్రభుత్వపరం చేసేలా మీరు కృషి చేయాలని మా విద్యార్థులు భవిష్యత్తు కోసం ఆలోచన చేయాలని అన్నారు.
పల్లా గారు మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ఈ సమస్యను తెలియజేస్తానని, మీరు ధైర్యంగా ఉండండి అని, విద్యార్థిని విద్యార్థులకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మధునాయుడు, జ్యోతి, విజయలక్ష్మి, స్వర్ణలత, భాస్కర్, నిరీక్షణ, రమణ , బోధేనతర సిబ్బంది పాల్గొన్నారు.




