Anakapalle: 111వ వార్డులో కూటమి ఇంటింటా ఓటు అవగాహన ప్రచారం!

Anakapalle: జీవీఎంసీ 111వ వార్డు భీముని గుమ్మం వీధిలో కూటమి శ్రేణులు ప్రచారం చేశారు బ్యాలెట్ పేపర్‌పై ఓటు వేసే విధానాన్ని సబ్బవరపు గణేష్ వివరిస్తూ ఓటర్లను కలిశారు

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 30 Oct 2026 5:05 PM IST
Anakapalle
X

Anakapalle: 111వ వార్డులో కూటమి ఇంటింటా ఓటు అవగాహన ప్రచారం!

Anakapalle: అనకాపల్లి జీవీఎంసీ 111వ వార్డులో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా ఈరోజు భీముని గుమ్మం వీధిలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ, ఓటర్లకు బ్యాలెట్ పేపర్‌పై ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి సబ్బవరపు గణేష్ స్వయంగా ఇంటింటికీ వెళ్లి వృద్ధులతో పాటు తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకోనున్న యువతీ యువకులకు ఓటింగ్ ప్రక్రియను వివరించారు.

111వ వార్డు కూటమి బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి పలక యశోదకు కమలం గుర్తుపై, కూటమి టీడీపీ మేయర్ అభ్యర్థి డాక్టర్ ముక్క శ్రావణికి సైకిల్ గుర్తుపై బ్యాలెట్ పేపర్‌లో ఏ విధంగా ఓటు వేయాలో ఓటర్లకు తెలియజేశారు.

ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని, ఎన్నికల ప్రక్రియపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా వివరించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డు మాజీ అధ్యక్షుడు పోతల శ్రీను, బూత్ ఇన్‌ఛార్జ్ సిమిటి రామకృష్ణ, దౌర్ల కిషోర్ కుమార్, శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానం ధర్మకర్త ఎల్లబెల్లి కనకతో పాటు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. మొత్తంగా 111వ వార్డులో ఇంటింటి ఓటు అవగాహన కార్యక్రమం ద్వారా కూటమి శ్రేణులు ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI