Gajuwaka: గాజువాకలో కూటమి మేయర్ అభ్యర్థి ముక్క శ్రావణి, పల్లా శ్రీనివాస్ ప్రచారం!

Gajuwaka: గాజువాక 85వ వార్డులో విశాఖ మున్సిపల్ ఎన్నికల ప్రచారం. మేయర్ అభ్యర్థి ముక్క శ్రావణి, ఎంపీ భరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుల భారీ ర్యాలీ.

PRAKASH, GAJUWAKA
Published on: 25 Oct 2026 3:04 PM IST
Gajuwaka
X

Gajuwaka: గాజువాకలో కూటమి మేయర్ అభ్యర్థి ముక్క శ్రావణి, పల్లా శ్రీనివాస్ ప్రచారం!

Gajuwaka: విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా గాజువాక 85 వ వార్డు కూటమి తరఫున టిడిపి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ రావు వార్డుతో పాటు గాజువాక నియోజకవర్గం లో పలువార్డులలో ప్రచారం లో భాగంగా కూటమి మేయర్ అభ్యర్థి ముక్క శ్రావణి విశాఖ ఎంపీ భారత్ గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ రెండున్నర సంవత్సరాలలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు గుర్తు చేస్తూ రాబోయే ఎలక్షన్లో కూడా కూటమికి అఖండ విజయాన్ని ఇచ్చి గెలిపించి విశాఖ ఉజ్వల భవిష్యత్తుకు కారణం కావాలని శ్రావణి కోరారు...

బీసీలకు మహిళలకు పెద్దపీట వేసిన ఏకైక పార్టీ టిడిపి పార్టీ అని ఏ రాజకీయ అనుభవం లేని ఒక మధ్య తరగతి కుటుంబం చెందిన బీసీ మహిళ ఆయన నాకు కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా ప్రకటించడం టిడిపి పార్టీకి బీసీల పట్ల మహిళల పట్ల ఉన్న అంకితభావం అర్థమవుతుంది...

బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్లే ఏకైక పార్టీ టిడిపి పార్టీ అని ఈ సందర్భంగా ఆవిడ ప్రజలకు తెలిపారు...

ప్రజలందరికీ తమ ఓటును వినియోగించుకొని విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో తమ వార్డులలో కూటమి అభ్యర్థులకు మరియు మేయర్ అభ్యర్థిగా సైకిల్ గుర్తుకి తమ అమూల్యమైన ఓటును వేసి తమను తమ తోటి కూటమి అభ్యర్థులను అఖండ విజయం తో గెలిపించాలని ముక్క శ్రావణి ప్రజలను కోరారు..

PRAKASH, GAJUWAKA

PRAKASH, GAJUWAKA