Visakhapatnam: ర్యాలీలో పాల్గొన్న చోడే పట్టాభిరామ్, విజయ్ బాబు!
Visakhapatnam: విశాఖ జిల్లా భీమిలి మండలం టి. నగరపాలెంలో కూటమి సర్పంచ్ అభ్యర్థి కోరాడ రామకృష్ణ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది.
Visakhapatnam: ర్యాలీలో పాల్గొన్న చోడే పట్టాభిరామ్, విజయ్ బాబు!
Visakhapatnam: విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం టి. నగరపాలెంలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కోరాడ రామకృష్ణ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో నిర్వహించిన ఈ ర్యాలీకి కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సందడి నెలకొంది. పార్టీ శ్రేణుల నినాదాలు, నాయకుల ఉత్సాహంతో ర్యాలీ అట్టహాసంగా సాగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చోడే పట్టాభిరామ్, భీమిలి నియోజకవర్గ ఇన్‌చార్జ్ చిక్కాల విజయ్ బాబు, జిల్లా పరిషత్ పశుసంవర్ధక శాఖ చైర్మన్ గాడు వెంకటప్పడు, భీమిలి మండల పార్టీ అధ్యక్షులు సరగడ అప్పారావు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు డి ఎ ఎన్ రాజు (బుజ్జి), మండల ఎంపీపీ కృష్ణవేణి, అనిల్ ప్రసాద్, టి. నగరపాలెం ఎంపీటీసీ పొట్నూరు రాము పాల్గొన్నారు.అలాగే మాజీ సర్పంచులు పల్ల వెంకటరావు, పల్ల రామారావుతో పాటు పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొని కోరాడ రామకృష్ణకు మద్దతు తెలిపారు. భారీ జనసమీకరణతో టి. నగరపాలెంలో ఎన్నికల సందడి నెలకొంది.




