Munchingiputtu: ముంచంగిపుట్టు మండలంలో జోరుగా పింఛన్ల పంపిణీ!

Munchingiputtu: అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలంలో లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేసిన టీడీపీ డివిజన్ అధ్యక్షుడు, దారెల సర్పంచ్ పాండురంగ స్వామి.

SAI, PADERU
Published on: 1 Oct 2026 3:35 PM IST
Munchingiputtu
X

Munchingiputtu: ముంచంగిపుట్టు మండలంలో జోరుగా పింఛన్ల పంపిణీ!

Munchingiputtu: అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలంలో ​కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలందరికీ త్వరితగతిన అందేలా టిడిపి డివిజన్ అధ్యక్షుడు పాండురంగ స్వామి ప్రత్యేక బాధ్యత వహించారు.

ముంచంగిపుట్టు మండలంలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొని, వృద్ధులతో మమేకమయ్యారు. లబ్ధిదారులైన వృద్ధులకు ఆయన స్వయంగా పెన్షన్ నగదును అందజేశారు.

​గతంలో దారెల సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తించి, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ మండల వ్యాప్తంగా ప్రజల హృదయాల్లో పాండురంగ స్వామి చెరగని ముద్ర వేసుకున్నారని స్థానికులు కొనియాడారు.

ఈ సందర్భంగా దారెల సర్పంచ్ పాండురంగస్వామి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసి ప్రభుత్వ అభివృద్ధి ప్రజలకు వివరించే ప్రయత్నంలో భాగంగా తాను స్వయంగా ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తున్నానని స్వామి తెలిపారు ఈ కార్యక్రమంలో దారాల సర్పంచ్ పాండురంగ స్వామి తో పాటు వృద్ధులు యవ్వనులు మహిళలతో పాటు అనేకమంది యువకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

SAI, PADERU

SAI, PADERU