Araku: పెదబయలులో వైభవంగా అరకు నియోజకవర్గ కూటమి సమన్వయ సమావేశం!
Araku: గిరిజనులను మోసం చేసిన జగన్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని అరకు టీడీపీ ఇన్చార్జ్ దొన్ను దొర పిలుపునిచ్చారు.
Araku: పెదబయలులో వైభవంగా అరకు నియోజకవర్గ కూటమి సమన్వయ సమావేశం!
Araku: గిరిజనులను నమ్మించి మోసగించిన వ్యక్తి జగన్ అని...ఆయన పార్టీ నేతలను స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని తెలుగుదేశం పార్టీ అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి , ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం ప్రాంతీయ జోన్ చైర్మన్ డా సియ్యారి దొన్ను దొర గారు పిలుపునిచ్చారు. పెదబయలు మండల కేంద్రంలో పెదబయలు, హుకుంపేట, ముంచంగిపుట్టు మండలాల కూటమి పార్టీల సమన్వయ సమావేశం శనివారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గం పరిశీలకులు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దొన్ను దొర గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఎంతో తమకు మేలు చేస్తారన్న ఉద్దేశంతో గిరిజన ప్రాంతం ఏకపక్షంగా ఆయనకు ఓట్లేసి గెలిపించిందని తెలిపారు. కానీ 45 ఏళ్లకే గిరిజలకు పెన్షన్ ఇస్తానని చెప్పిన వ్యక్తి ఏ ఒక్కరికీ ఇవ్వలేదన్నారు. ప్రతి ఒక్కరికీ ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్న జగన్ నమ్మించి మోసం చేశారన్నారు.
ఏ గ్రామానికి ఒక్క రోడ్డు కూడా వేయలేదనీ తెలిపారు. జగన్ హయంలో అత్యంత దుర్మార్గపు పాలన సాగిందన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్ల కాలంలో గిరిజన ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి కేవలం ఒక అల్లూరి జిల్లాకి రూ.1050 కోట్లు కూటమి ప్రభుత్వం కేటాయించిన విషయం ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నారు.
అది కాకుండా పల్లె పండుగకు మరో రూ. 1500 కోట్లు కేటాయించారనీ మొత్తంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూ. 2500 కోట్లు కేటాయించిన చరిత్ర ఇప్పటివరకు ఎప్పుడూ లేదన్నారు. తొలిసారిగా గ్రామాల్లో రోడ్లు వేయడానికి, గోకులాల నిర్మించడానికి, చెత్త నుంచి సంపద కేంద్రాల నిర్మాణానికి, సిసి రోడ్ల నిర్మాణానికి పల్లెల్లో అభివృద్ధి చేసేందుకు రూ. 2500 కోట్లు కేటాయించిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. అందుకే ఈరోజు గిరిజన ప్రాంతంలో ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వం పట్ల ఆకర్షితులవుతున్నారన్నారు. గౌరవ చంద్రబాబు నాయుడు గారి పాలన విధానం పట్ల ఆకస్తులు అవుతున్నారని తెలిపారు.
కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ మనమే ఉన్నామని కానీ స్థానిక సంస్థల్లో ఇప్పటి వరకు వైసిపి రాజ్యమేలిందని ఇకనైనా కూటమి అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి మరింత వేగవంతంగా చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. డబల్ ఇంజన్ సర్కార్ తోనే ఇంత వేగవంతమైన అభివృద్ధి చేస్తే ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అయితే మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ మనకు ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డి అతని పార్టీ అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాంగి రాజారావు, బిజెపి అల్లూరు జిల్లా అధ్యక్షులు మఠం శాంతకుమారి, జనసేన POC శెట్టి చిరంజీవి కూటమి మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.




