Tagarapuvalasa: అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో దసరా సంబరాలు

Tagarapuvalasa: తగరపువలస అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో దసరా సంబరాలు అంబరాన్నంటాయి. దేవీ పూజలు, రంగోలి, దాండియా నృత్యాలతో విద్యార్థులు విశేషంగా అలరించారు.

SHIVA, BHIMILI
Published on: 17 Oct 2026 4:15 PM IST
Tagarapuvalasa
X

Tagarapuvalasa: అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో దసరా సంబరాలు

Tagarapuvalasa: తగరపువలస అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో దసరా సంబరాలను ఘనంగా నిర్వహించినారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, మానేజ్మెంట్ స్టడీస్, డిగ్రీ మరియు పోలిటెక్నిక్ వివిధ విభాగాలు వారు దేవీపూజలను ఘనంగా జరిపి అమ్మవారికి నైవేద్యములను సమర్పించారు.

ఈ కార్యక్రమములో విద్యార్థులు దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి వేషధారణ తోను అలాగే అచ్చమైన తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు వెళ్లి విరిసేటట్లుగా వస్త్రాలను దరించి విద్యార్థులు కేరింతలు వేశారు.

కళాశాల ఆవరణలో దేవీ నవరాత్రుల సందర్భంగా రంగోలి, దాండియా, తెలుగు సాంప్రదాయ కట్టుబాట్లు వంటి కార్యక్రమాలు నిర్వహించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందించారు దసరా నవరాత్రి ఉత్సవాలు యొక్క ప్రాముఖ్యతను వివరించి వాళ్ళలో సంస్కృతి గొప్పతనం గురించి వివరించారు.

ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. మురళీకృష్ణ గారు, డైరెక్టర్ డా. ఎ. చంద్రశేఖర్ గారు, ఫార్మసీ ప్రిన్సిపాల్ డా. కె. పూర్ణనాగశ్రీ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పిన్నింటి రామకృష్ణ, పోలిటెక్నిక్ ప్రిన్సిపాల్ బి. జగదీశ్వరరావు, డా. సుమన్ దత్తా, డా. సరీఫ్ గారు అలాగే వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI