Anakapalli: అనకాపల్లి ఎస్పీ ఆఫీసులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర శ్రమదానం

Anakapalli: అనకాపల్లి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం విస్తృతంగా శ్రమదానం నిర్వహించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 19 Sept 2026 2:09 PM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లి ఎస్పీ ఆఫీసులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర శ్రమదానం

అనకాపల్లి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో శనివారం విస్తృతంగా శ్రమదానం నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ శ్రీ ఎల్. మోహనరావు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.

జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని కార్యాలయ ఆవరణతో పాటు పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. చెత్తను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ ఎల్. మోహనరావు మాట్లాడుతూ.. ఈ నెల “స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమాన్ని “గ్రీన్ ఆంధ్ర–కూల్ ఆంధ్ర” థీమ్‌తో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు పచ్చదనాన్ని పెంపొందించడమే ప్రధాన లక్ష్యమన్నారు.

నెట్ జీరో నైబర్‌హుడ్స్‌లో భాగంగా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, వార్డులు, గ్రామ పంచాయతీల సమన్వయంతో పర్యావరణహిత విధానాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే పట్టణ అడవుల అభివృద్ధి, విస్తృతంగా మొక్కలు నాటడం, రహదారుల వెంట అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టడం వంటి చర్యలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

పాత చెత్త డంపింగ్ ప్రదేశాలను శుభ్రపరిచి వాటిని ఆహ్లాదకరమైన హరిత ప్రాంతాలుగా మార్చడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని తెలిపారు. పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ఆయన సూచించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI