Madhurawada: మధురవాడ రైతుబజార్లో రాయితీ ధరలకు ఉల్లి విక్రయాలు ప్రారంభం!
Madhurawada: భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మధురవాడ రైతుబజార్లో రాయితీ ధరలకు ఉల్లి విక్రయాలను శనివారం ప్రారంభించారు.
Madhurawada: మధురవాడ రైతుబజార్లో రాయితీ ధరలకు ఉల్లి విక్రయాలు ప్రారంభం!
Madhurawada: నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రిస్తూ సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఇందులో భాగంగా మధురవాడ రైతుబజార్లో రాయితీ ధరలకు ఉల్లి విక్రయాలను శనివారం ఉదయం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్కెట్‌లో ఉల్లి ధరలు పెరిగిన నేపథ్యంలో వినియోగదారులకు తక్కువ ధరకే ఉల్లి అందించేందుకు రాయితీ విక్రయాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటు ధరల్లో లభించేలా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోందన్నారు. రాయితీ ఉల్లి విక్రయాల సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అనంతరం ఎమ్మెల్యే రైతుబజార్‌లోని వివిధ ప్రాంతాలను పరిశీలించారు. రైతులు, వినియోగదారులకు అందుతున్న సౌకర్యాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రైతుబజార్ పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, మార్కెట్‌ను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, స్థానిక టీడీపీ నాయకులు, సంబంధిత అధికారులు, రైతుబజార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




