Paderu: విద్యార్థులు సృజనాత్మకత పెంపొందించుకోవాలి: కలెక్టర్ నిశాంతి
Paderu: సేవా సంకల్పంలో భాగంగా పాడేరులో నిర్వహించిన జిల్లా స్థాయి డ్రాయింగ్, ఎలక్యూషన్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కలెక్టర్ నిశాంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Paderu: విద్యార్థులు సృజనాత్మకత పెంపొందించుకోవాలి: కలెక్టర్ నిశాంతి
Paderu: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు వివిధ దశల్లో నిర్వహించిన డ్రాయింగ్ మరియు ఎలక్యూషన్ పోటీల్లో జిల్లా స్థాయి పోటీలు గురువారం పాడేరులోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల బాలుర తలారిసింగిలో నిర్వహించారు.
జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఎన్. భానుమూర్తి రాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీమతి టి. నిశాంతి, ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు మంచి సృజనాత్మకతను పెంపొందించుకోవాలని, విద్యతో పాటు అన్ని రంగాల్లో ప్రతిభను కనబరచాలని సూచించారు. విద్యార్థులు తమలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇటువంటి పోటీలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
మండల స్థాయి క్రీడా పోటీలను పరిశీలించిన కలెక్టర్
అనంతరం జిల్లా కలెక్టర్ మండల స్థాయిలో జరుగుతున్న క్రీడా పోటీలను పరిశీలించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని, వారితో మాట్లాడారు.
క్రీడల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని, క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచి జిల్లా, రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
జిల్లా స్థాయి డ్రాయింగ్, ఎలక్యూషన్ పోటీల విజేతలు
కేటగిరీ–1: 6, 7, 8 తరగతులు
డ్రాయింగ్ పోటీలు
ప్రథమ బహుమతి:
జి. ప్రసన్న – KGBV, పాడేరు
ద్వితీయ బహుమతి:
ఎస్. జోసెఫ్ – CAHS, తలారిసింగి
తృతీయ బహుమతి:
డి. వంకల దీనా – GTWA, బాలికల పాఠశాల, లంబసింగి
ఎలక్యూషన్ పోటీలు
ప్రథమ బహుమతి:
కె. నీరజ – GHS, తాజంగి
ద్వితీయ బహుమతి:
డి. రాధికప్రియ – KGBV, జి.కె.వీధి
తృతీయ బహుమతి:
ఆర్. ముష్కాన్ – GHS, పాడేరు
కేటగిరీ–2: 9, 10 తరగతులు
డ్రాయింగ్ పోటీలు
ప్రథమ బహుమతి:
కె. అవంతిక – GTWA బాలికల పాఠశాల, పెదబయలు
ద్వితీయ బహుమతి:
ఇ. సుకన్య – GHS, హుకుంపేట
తృతీయ బహుమతి:
కె. క్రిస్టినా – GWA బాలికల పాఠశాల, కొత్తబల్లుగూడ
ఎలక్యూషన్ పోటీలు
ప్రథమ బహుమతి:
ఎన్. వరప్రసాద్ – GHS, హుకుంపేట
ద్వితీయ బహుమతి:
డి. గీతిక – GTW బాలికల పాఠశాల, బింపోలు
తృతీయ బహుమతి:
పి. పావని – GTW బాలికల పాఠశాల, గూడ
జిల్లా స్థాయి డ్రాయింగ్ మరియు ఎలక్యూషన్ పోటీల్లో ప్రతిభ కనబరిచి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించిన విద్యార్థులకు డిప్యూటీ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీచెల్లయ్య చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ విద్యాశాఖ అధికారి శ్రచెల్లయ్య, పాడేరు మండల విద్యాశాఖ అధికారి శ్ విశ్వనాథన్, శ్రీమతి సరస్వతి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రతినిధి శ్రీ భూపతిరాజు, శ్రీమతి లక్ష్మీపార్వతి తదితరులు పాల్గొన్నారు.




