Narsipatnam: తామరం భూ ఆక్రమణలపై ఆర్డీఓకు బాధితుల ఫిర్యాదు!
Narsipatnam: అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం తామరం పరిధిలో సర్వే నంబర్ 61/3 భూమి ఆక్రమణ ప్రయత్నాలను అడ్డుకోవాలని బాధితులు నర్సీపట్నం ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు.
Narsipatnam: తామరం భూ ఆక్రమణలపై ఆర్డీఓకు బాధితుల ఫిర్యాదు!
Narsipatnam: మాకవరపాలెం మండలం తామరం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 61/3లో సుమారు 21 ఎకరాల భూమిపై జరుగుతున్నట్లు ఆరోపిస్తున్న ఆక్రమణ ప్రయత్నాలను అడ్డుకుని, పాత రెవెన్యూ రికార్డులను పరిశీలించి న్యాయం చేయాలని తుడుము భవాని, కుటుంబ సభ్యులు నర్సీపట్నం ఆర్డీఓకు పీజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు చేశారు.
సుమారు 10 దళిత నిరుపేద కుటుంబాలు గత 60 సంవత్సరాలుగా ఈ భూములను సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2013లో సాగు భూమిలో సుమారు 50 మామిడి, 30 జీడి చెట్లను నరికివేసిన ఘటనకు సంబంధించిన పోలీస్ ఫిర్యాదు, అప్పటి చర్యలను పరిశీలించాలని కోరారు.
ప్రస్తుతం రుత్తల ఎర్రపాత్రుడు, ఇతరులు భూమిలోకి ప్రవేశించి మొక్కలు నాటుతున్నారనే ఆరోపణలపై విచారణ జరపాలని, 1977 SFI రికార్డులు, 10(1) అడంగల్, పాత సాగు రికార్డులను పరిశీలించాలని కోరారు. గతంలో కొండ పోరంబోకుగా ఉన్న భూమి గడ్డ పోరంబోకుగా మారిందా, అదే సర్వే నంబర్‌లోని సుమారు రెండు ఎకరాలు ఇతరుల పేర్లపై ఎలా నమోదయ్యాయనే అంశాలపై కూడా విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే, ఈ భూమికి సంబంధించి హైకోర్టులో W.P.No.20655/2026 కేసు పెండింగ్‌లో ఉన్నందున తుది తీర్పు వెలువడే వరకు భూమి స్వరూపాన్ని మార్చే చర్యలు, కొత్త ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపి, రికార్డుల ఆధారంగా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు ఆర్డీఓను కోరారు.




