Anakapalli: చోడవరంలో డ్రైనేజీని శుభ్రం చేసిన యువకుడు!

Anakapalli: చోడవరంలో మూసుకుపోయిన డ్రైనేజీ కాలువను స్వచ్ఛందంగా శుభ్రం చేసిన యువకుడు, సామాజిక కార్యకర్త పుల్లటి గణేష్. అభినందిస్తున్న స్థానికులు. వివరాలు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 29 Sept 2026 8:40 AM IST
Anakapalli
X

Anakapalli: చోడవరంలో డ్రైనేజీని శుభ్రం చేసిన యువకుడు!

Anakapalli: చోడవరం మండల కేంద్రం లోని వెంకయ్య గారి పేట ముత్యాలమ్మ తల్లి గుడి దగ్గర చెరువుకు వచ్చే కాలువలో చెత్తాచెదారాలు పేరుకుపోవడంతో కాలువ నీరు చెరువులోకి కాకుండా రోడ్లపై ప్రవహిస్తుంది...... ఇటీవల కురిసిన వర్షాలు దీనికి తోడవడంతో వాహనాల రాకపోకలకు ప్రజలకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి నెలకొన్నాయి

ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త పుల్లటి గణేష్ స్వచ్ఛందంగా సమీపంలోని ముత్యాలమ్మ తల్లి గుడి దగ్గర ఉన్న చెరువులోకి నీరు ప్రవహించడానికి వీలుగా అక్కడి కాలువలను శుభ్రపరిచే పనులను చేపట్టారు.

ప్రధానంగా కాలువలో వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ కవర్లు చెత్తాచెదారాలు వేయడం వల్ల కాలువలు మూసుకుపోతు న్నాయని చెరువులోకి రావాల్సి నీరు ఆగిపోవడం కాకుండా దుర్వాసన కూడ ఉందన్నారు పంచాయతీ సిబ్బందికి

తెలియజేసిన వాళ్లు తరచూ కాకుండా అప్పుడప్పుడు వచ్చి డ్రైనేజీని క్లీన్ చేస్తున్నప్పటికీ పరిస్థితి షరా మామూలుగా మారుతుంది. అందుచే ప్రజలు ఇబ్బందులను గుర్తించి ఈరోజు కాలు శుభ్రం చేసే పనులను చేపట్టమన్నారు.

ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా తన వంతు బాధ్యతగా డ్రైనేజీ కాలువను శుభ్రపరచడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.... ప్రతి పౌరుడు తన సామాజిక బాధ్యతను గుర్తించినప్పుడు అద్భుతమైన సమాజాన్ని చూడొచ్చని ఈ సందర్భంగా పుల్లేటి గణేష్ తెలిపారు

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM