Simhachalam: బంగారు కాంతులతో మెరిసిపోతున్న సింహాచలం ధ్వజస్తంభం పీఠం!
Simhachalam: విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయ ధ్వజస్తంభం పీఠానికి సిఎంఆర్ సంస్థ అధినేత మావూరి వెంకటరమణ రూ.1.20 కోట్ల విలువైన స్వర్ణ తాపడాన్ని కానుకగా సమర్పించారు.
Simhachalam: బంగారు కాంతులతో మెరిసిపోతున్న సింహాచలం ధ్వజస్తంభం పీఠం!
సింహాచలం: విశాఖ సింహాచలం క్షేత్రంలో శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయ ద్వజస్థంభం పీఠం స్వర్ణ తాపడం తో ధగ ధగ మెరుస్తూ భక్తుల కి దర్శనం ఇవ్వనుంది. సింహాద్రి అప్పన్న స్వామి వారి ద్వజస్థంభం పీఠం కి స్వర్ణ తాపడం ను విశాఖ ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ సి. ఎం. ఆర్. సంస్థ అధినేత మావూరి వెంకట రమణ స్వామికి కనుక గా సమర్పించటం.
అప్పన స్వామి వారిపై ఉన్న అపారమైన భక్తితో ద్వజస్థంభం పీఠం(509.600 గ్రాముల బంగారముతో) ఒక కోటి 20 లక్షల రూపాయలవిలువు గల స్వర్ణ తపడం స్వామివారికి కానుక సమర్పించారు. గతంలో ఈ ధ్వజస్తంభానికి సుమారుగా రెండు కోట్ల 80 లక్షల రూపాయలు విలువగల 1802. 00గ్రాముల స్వర్ణ తాపడం చేయించారు. ఈ
రెండు కలిపి నాలుగు కోట్ల రూపాయలతో బంగారు తాపడం కానుక గా స్వామి కి సమర్పించారు. అనంతరం స్వామి అంతరాలయంలో మావూరి వెంకటరమణా కుటుంబసభ్యులతో ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం అధికారులు మావూరి వెంకటరమణా కుటుంబ సభ్యుల కి వేద ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.




