Simhachalam: సింహాచలం అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా జరగాలి: గంటా
Simhachalam: సింహాచలం దేవస్థానాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సూచించారు; ఆలయ ఈఓ వెంకట్రావు ఆయనతో భేటీ అయ్యారు.
Simhachalam: సింహాచలం అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా జరగాలి: గంటా
Simhachalam: సింహాచలం దేవస్థానంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాల చేపట్టాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో ఆయన్ను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జె.వెంకట్రావు కలిశారు.
దేవస్థానంలో జరుగుతున్న ఉత్సవాలు, అభివృద్ధి పనుల గురించి వివరించారు. ట్రస్టు బోర్డులో ఆమోదించిన వివిధ ప్రతిపాదనలను తెలియజేశారు. సింహాచలం దేవస్థానం స్వచ్ఛ అవార్డు సాధించినందుకు ఈఓను గంటా అభినందించారు. సింహాద్రి అప్పన్న స్వామి వారి ప్రసాదాన్ని, పవిత్రాలను ఈఓ అందజేశారు.




